బన్నీని అడ్డుకొన్న పవన్ ఫ్యాన్స్.. ఇది నిజమా ?

allu arjun (11)
స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చుక్కులు చూపించారా.. ? అంటే అవుననే అంటున్నారు. ఇటీవలే జరిగిన మెగాస్టార్ ‘ఖైదీ నెం.150’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఈ సంఘటన చేసుకొందట. కాస్త ఆలస్యంగా ఈ విషయం బయటికి వచ్చింది. ఈ పంక్షన్ వస్తోన్న సమయంలో పవన్ ఫ్యాన్స్ ని బన్నీ ని చుట్టుముట్టారట. పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ నినాదాలు చేశారట. దీంతో.. పవన్ ఫ్యాన్స్ మధ్యలో చిక్కుకున్న బన్ని ఎటు వెళ్లలేని పరిస్థితి. చివరికి పోలీసుల సహాయంతో బన్నీ అక్కడి నుంచి వేదిక దగ్గరికి చేరుకొన్నట్టు సమాచారమ్.

గతంలో ‘సరైనోడు’ ఆడియో ఫంక్షన్ లో ‘చెప్పన్ బ్రదర్’ అంటూ పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు బన్ని. ఆ తర్వాత పవన్ ఫ్యాన్స్ కి వివరణ ఇచ్చుకొన్నాడు కూడా. ‘ఒక మనసు’ ఆడియో వేడుక సందర్భంగా పవన్ ఫ్యాన్స్ కి క్లాస్ పీకి.. మరీ సారీ చెప్పాడు. అయినా కూడా వీలుదొరికినప్పుడల్లా బన్ని ని కార్నర్ చేసే పనిలో ఉన్నారు పవన్ ఫ్యాన్స్.

అయితే, ఈ ఘటనపై బన్ని స్టేజ్ పై రెస్పాండ్ కాకపోవడం విశేషం. బహుశా.. పవన్ ఫ్యాన్స్ తో మళ్లీ పెట్టుకోవడం ఎందుకని భావించి ఉంటాడు. మొత్తానికి.. బన్నీ-పవన్ ఫ్యాన్ వార్ కంటిన్యూ అవుతూనే ఉందన్న మాట.