గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్


పవన్ కళ్యాణ్ కొత్త సినిమా చేయబోతున్నారా ? అవుననే వినిపిస్తుంది. కొత్త సినిమాలో నటించడానికి ఆయన కాస్త సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ మధ్య పాలిటిక్స్ లో బాగా బిజీ అయిపోయిన పవన్ మళ్ళీ సినిమాలో కనిపించే ఛాన్స్ వుండదని అనుకున్నారు.

అయితే ఆయన కొత్త సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. ఎ.ఎమ్‌.రత్నం నిర్మాణంలో పవన్‌ ఓ సినిమా చేయడానికి ఇదివరకే అంగీకరించారు. నేసన్‌ దర్శకత్వం వహించనున్న ఆ చిత్రానికి కొబ్బరికాయ కూడా కొట్టేశారు. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టు తెరపైకొచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకుడిగా పవన్‌ సినిమా తెరకెక్కబోతోందని ప్రచారం జరుగుతుంది.ఈ సినిమాకే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది.