పవన్ వాటికోసమైన సినిమాలు చేయాలి..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ ముఖానికి రంగు వేసుకోబోతున్నాడా..? ఇప్పుడు ఫిలిం సర్కిల్లో ఇదే హాట్ టాపిక్. సినిమా రంగంలో టాప్ స్థానంలో ఉండగా..సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిన పవన్..ఇప్పుడు ఎన్నికల ఫలితాల అనంతరం సినిమాల్లోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడట. దీనికి కారణం…హీరోగా సినిమాలు చేసేందుకు పలువురు నిర్మాతల నుంచి పవన్ కళ్యాణ్ అడ్వాన్స్‌లు తీసుకున్నాడు.

ఏపీ ఎన్నికల కారణంగా ఆయన సినిమాల నుంచి విరామం తీసుకున్నారు. ఒకవేళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సి వస్తే… పవన్ కళ్యాణ్ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఎన్నికల్లో రాజకీయంగా అనుకున్న ఫలితాలు సాధించకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ మనసు మార్చుకుని మళ్లీ సినిమాల్లో నటించే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు నిర్మాతలకు చెల్లించాల్సిన అడ్వాన్స్‌ల కోసమైనా ఆయన సినిమాలు చేయకతప్పని పరిస్థితి నెలకొందని కొందరి వాదన. మొత్తం మీద మాత్రం పవన్ మళ్లీ సినిమాలు చేస్తాడనేది గట్టిగా వినిపిస్తుంది.

ప్రస్తుతం పవన్ హైదరాబాద్ లోనే ఉన్నాడు..సినిమాల గురించే పలువురితో మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. ముందుగా మాత్రం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సినిమా చేయడం ఖాయంగా తెలుస్తుంది.