త్రివిక్రమ్ బడ్జెట్ బాగా పెరిగిపోతోందట..

pawan-trivikram

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే..అయితే ఈ మూవీ బడ్జెట్ మొదట్లో అనుకున్న దానికంటే రెట్టింపు అవుతుందని వినికిడి. త్రివిక్రమ్ కు బాగా కావాల్సిన వ్యక్తి చిన్న బాబు ఈ సినిమా కు నిర్మాత కావడం , మరో పక్క చిత్ర బిజినెస్ కూడా భారీగానే జరుగుతుండడం తో ఆయన ఏం మాట్లాడడం లేదని లేకపోతే ఇప్పటికే త్రివిక్రమ్ పేరు మారుమోగేదని అంత మాట్లాడుకుంటున్నారు.

pawan-trivikram
గతం లో కూడా త్రివిక్రమ్ తన సినిమాలకు భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం వల్ల నిర్మాతలకు భారీ నష్టాలే మిగిలాయి. దీంతో త్రివిక్రమ్ బయట నిర్మాతలకు సినిమాలు చేయకుండా తనతోనే సినిమాలు తీసే రాధాకృష్ణ బ్యానర్‌కే త్రివిక్రమ్‌ పరిమితమయ్యాడు. ఇప్పుడు ఈయన తో కూడా భారీగానే ఖర్చు పెట్టిస్తున్నాడట. ప్రస్తుతం పవన్ మూవీ యూరప్ షెడ్యూల్ కు రెడీ అయ్యింది. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలను ఇక్కడ షూట్ చేయబోతున్నారట.