పవన్-త్రివిక్రమ్.. ‘సమంత-చై’లకు సప్రైజ్ గిఫ్ట్.. !!

samantha chai

పవన్-త్రివిక్రమ్’లు సరిగ్గా పెళ్లిరోజున చైతూ-సమంతలకు షాక్ ఇచ్చినట్టు సమాచారమ్. సమంత-చై పెళ్లి వేడుకలో పవన్-త్రివిక్రమ్’ల సప్రైజ్ గిఫ్ట్ హైలైట్ గా నిలిచిందని చెప్పుకొంటున్నారు. ఇప్పుడీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ పవన్-త్రివిక్రమ్’లు ప్లాన్ చేసిన ఆ సప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా ? ఉంగరాల బహుమతి. అయితే, వాటిని సరిగ్గా వివాహ సమయానికి అందజేసి పెళ్లికొడుకు-పెళ్లికూతుర్లని సప్రైజ్ కి గురి చేశారట.

ఆ ఉంగరాలని ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్టు తెలుస్తోంది. నిజానికి వాటిని హైదరాబాద్ లో నిర్వహించబోయే రిసెప్షన్ వేడుకలో ఇద్దామని అనుకొన్నారంట. అయితే, పెళ్లి సమయాన్నికి ఇవ్వడమే బెటర్ అని.. సరిగ్గా పెళ్లి సమయానికి ఆ గిఫ్ట్ అందేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఇద్దరితోనూ సమంతకు మంచి అనుబంధం ఉంది. పవన్-త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో పవన్-సమంతల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది.