మెగా హీరో కు హ్యాండ్ ఇచ్చిన పూజా..?

డీజే బ్యూటీ పూజా హగ్దే ప్రస్తుతం టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ బ్యూటీ అయ్యింది. అమ్మడు ఏ సినిమా చేసిన అది హిట్ అవడమే కాదు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వసూళ్లు కనపరుస్తున్నాయి. ఎన్టీఆర్ తో అరవింద సమేత చేసిన ఈ బ్యూటీ తాజాగా మహేష్ సరసన మహర్షి చిత్రంలో జోడి కట్టి మరో హిట్ ను తన కథలో వేసుకుంది.

మహర్షి సెట్స్ మీద ఉండగానే మరిన్ని సినిమాలకు ఓకె చెప్పింది. త్రివిక్రమ్‌ అల్లు అర్జున్‌ సినిమా, ప్రభాస్ హీరోగా పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న జాన్‌ సినిమాలతో పాటు వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న వాల్మీకి సినిమాలోనూ నటించేందుకు ఓకే చెప్పింది. అయితే తాజాగా పూజా..వాల్మీకి కి హ్యాండ్ ఇచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. డేట్స్ అడ్జస్ట్‌ కాకపోవడం తో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. తమిళ సూపర్‌ హిట్ జిగర్‌తాండకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్‌ నెగెటివ్‌ రోల్‌ లో కనిపించనున్నాడు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.