చరణ్ ఐటమ్ దొరికింది

pooja

సుకుమర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ‘రంగస్థలం 1985’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న అచ్ఛమైన ప్రేమకథా చిత్రమిది. చరణ్ సరసన సమంత జతకట్టనుంది. ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే ఐటమ్ సాంగ్ ని రెడీ చేశాడని చెప్పుకొన్నారు. ఈ సాంగ్ కోసం బాలీవుడ్ భామలు కరీనా కపూర్, ప్రియాంక చోప్రాల పేర్లు వినిపించాయి.

అయితే, ఇప్పుడా అవకాశం డీజే భామ పూజా హెగ్డే కి దక్కినట్టు సమాచారమ్. త్వరలోనే పూజాపై ఐటమ్ సాంగ్ ని చిత్రీకరించనున్నారు. ఈ సాంగ్ లో అందాల ఆరబోత మాములుగా ఉండదని చెబుతున్నారు. మరీ.. డీజే భామ ఏ రేంజ్ లో రెచ్చిపోతుందో చూడాలి.

ఇప్పటికే స్టార్ హీరోయిన్స్ తమన్నా, కాజల్ ఐటమ్ సాంగ్ చేశారు. వారు చేసిన ఐటమ్ సాంగ్స్ కి క్రేజ్ తీసుకొచ్చారు. ఇప్పుడు పూజా హెగ్డే కూడా ఐటమ్ గా మారింది. మరీ.. ఐటమ్ భామగా ఆమె ఏ మేరకు మెప్పిస్తుందనే చూడాలి.