ఆ పని కోసం కేవలం 15ని॥లు మాత్రమే !

Pooja-Green

అన్నీ ఉన్నా అదృష్టం లేని హీరోయిన్స్ లో పూజా హెగ్డే ఒకరు. వరుణ్ తేజ్ ‘ముకుందా’తో తెలుగు తెరకు పరిచయమైంది.. ఈ ముద్దుగుమ్మ. చైతూతో కలసి ‘ఒక లైలా కోసం’ చేసింది. ఈ రెండు చిత్రాలు యావరేజ్ గా ఆడాయి. దీంతో.. టాలీవుడ్ నుంచి పూజాకి పిలుపులు రాలేదు. దురదృష్టం తలుచుకొని ఫీలయ్యే లోపే బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చిపడింది.

ఏకంగా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ‘మొహంజదారో’లో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాపై భారీ ఆశలని పెట్టుకొంది. ‘మొహంజదారో’ ఆశించినంత స్థాయిలో ఆడకపోవడంతో.. రెండేళ్లుగా పూజా పెట్టుకొన్న ఆశలు అడియాశలయ్యాయి. అయితే, ఈ ప్లాపులు పూజాకి అనుభవాన్ని మిగిల్చాయి. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. వాటిని ఎలాగైతే మనం కంట్రోల్‌ చేయలేమో.. అలాగే సినిమా సక్సెస్‌ని కూడా మనం నిర్ణయించలేము అంటోంది.

అంతేకాదు.. తనకి ఎదురైన పరాభవాల గురించి బాధపడటానికి రోజులో ఓ 15 నిమిషాలు కేటాయిస్తుందట. చూస్తుంటే.. ? గత పరాభవాలు పూజాని ఇంకా వేటాడుతూనే ఉన్నట్టున్నాయి.

ప్రస్తుతం బన్ని’దువ్వాడ జగన్నాథం’ హీరోయిన్ గా చేస్తోంది పూజా. ఈ చిత్రమైనా తన తలరాతని మారుస్తుందని ఆశపడుతోంది. మరీ.. డీజే బన్ని కోరికని తీరుస్తాడేమో చూడాలి.