మహర్షి కోసం పూజా ఎంత తీసుకుందో తెలుసా..?

‘ఒక లైలా కోసం’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన పూజా హగ్దే..కెరియర్ మొదట్లో వరుస ప్లాప్స్ అందుకొని ఐరెన్ లెగ్ ముద్ర వేసుకుంది. అల్లు అర్జున్ -హరీష్ శంకర్ పుణ్యమా అని డీజే చిత్రం తో అమ్మడి జాతకం మారింది. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా పూజా కు మాత్రం బాగా కలిసొచ్చింది. ఆ చిత్రం తర్వాత శ్రీమంతుడు , రంగస్థలం (ఐటెం సాంగ్) , అరవింద సమేత చిత్రాలతో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో బడా చిత్రాలు ఉండడం తో అమ్మడు వార్తల్లో తెగ చక్కర్లు కొడుతుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మహర్షి చిత్రం లో పూజా హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు , పివిపి, అశ్విని దత్ లు సంయుక్తం గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. ఏప్రిల్ నెలలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటె ఈ సినిమాకు గాను పూజా తీసుకున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది. ఈ చిత్రానికి గాను పూజా అక్షరాలా కోటి 75 లక్షల పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఈ సినిమాకు బల్క్ డేట్స్ ఇవ్వడమే అని..అందుకే ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుందని అంటున్నారు. మరి ఈ రెమ్యూనరేషన్ వార్తలో ఎంత నిజం ఉందొ తెలియాల్సి ఉంది.