పూజా ఇది నిజామా..?

పూజా హగ్దే..ఈ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మారుమోగిపోతుంది. ఇండస్ట్రీ కి గోల్డెన్ లెగ్ గా మారింది పూజా. అందుకే అగ్ర హీరోల దగ్గరి నుండి చిన్న చితక హీరోల వరకు అందరూ ఈమెనే కావాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , మహేష్ బాబు వంటి వారితో నటించి హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ..ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ సినిమా చేస్తుంది. అలాగే హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న వాల్మీకి చిత్రంలోనూ నటిస్తుందని అధికారిక ప్రకటన వచ్చిన కానీ కొంతమంది నటించడం లేదని..డేట్స్ కుదరక నో చెప్పిందని అంటున్నారు. మరికొంతమంది మాత్రం లేదు లేదు పూజా నటిస్తుందని చెపుతున్నారు. ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుండగా..తాజాగా మరో వార్త బయటకు వచ్చింది.

వాల్మీకి చిత్రంలో కథ ప్రకారం వరుణ్ తేజ్ సరసన పూజా నటించడం లేదట.. ఇందులో హీరో లాంటి మరో కీలక పాత్ర చేస్తున్న తమిళ నటుడు అధర్వాకు జోడిగా నటిస్తుందని అంటున్నారు. అధర్వా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయస్తాడు కాదు. అంజలి నటించిన సిబిఐ సినిమాలో నటించాడు కానీ ఆ సినిమా ప్లాప్ కావడం తో అధర్వా ఎవరికీ తెలియకుండా అయిపోయాడు. ఇప్పుడు పూజాను తన సరసన వాడుకోవడం అంటే ప్రేక్షకులు ఆమోదిస్తారా అనేది ప్రశ్న. మరి ఈ వార్త నిజామా కదా అనేది తెలియాల్సి ఉంది.