ఆ ఐదారుగురు పవన్ ని చంపేస్తారట !


హీరోయిన్ పూనమ్ కౌర్‌ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో ఆమెకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో లింకుపెడుతూ బోలేడు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆమెకి సంబంధించిన ఆడియో టేపు ఒకటి బయటికొచ్చింది. ఇందులో పూనమ్ కౌర్‌ భావిస్తున్న ఓ గొంతు పవన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

పవన్ కల్యాణ్ వల్ల నాకు అన్యాయం జరిగింది. దానికి నోరు మూసుకొన్నా మిగితా వారు ఊరుకొనే అవకాశం కనిపించడం లేదు. నాలుగైదు ఏళ్ల క్రితం జరిగిన వ్యవహారాల వల్ల ఐదు లేదా ఆరుగురు మోసానికి గురయ్యారు. వారందరూ పవన్ చంపేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను మాత్రం నోరు మెదపను అని ఆడియో టేప్‌లో చెప్పడం వినొచ్చు. దీంతో.. పవన్ ని టార్గెట్ చేసిన ఆ ఐదారుగురు ఎవరు ? ఎన్నది హాట్ టాపిక్ గా మారింది.