‘సాహో’లో ప్రభాస్ లుక్ ఇదే !

prabhas\

సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దాదాపు రూ. 150కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. ఇదీగాక, ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తోన్న చిత్రం కావడంతో ‘సాహో’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

ఈ చిత్రంలో ప్రభాస్ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ఇందుకోసం రకరకాల లుక్స్ ని ప్రభాస్ ట్రై చేసినట్టు చెబుతున్నారు. చివరకు ఓ లుక్ ని ఫైనల్ చేశారు. ప్రస్తుతం ప్రభాస్ కొత్త లుక్ లో ఉన్న ఓ పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ లుక్ తోనే ప్రభాస్ సాహోలో కనిపించబోతున్నట్టు చెబుతున్నారు. ఇదే నిజమైతే.. సాహో లో ప్రభాస్ లుక్ అదిరిపోయినట్టే.

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన్ బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ జతకట్టనుంది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ బాషల్లో రిలీజ్ కానుంది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం పలువు హాలీవుడ్, బాలీవుడ్ టెక్నీషన్స్, నటీనటులు నటించనున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాని వచ్చే యేడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.