కేజీఎఫ్ డైరెక్టర్ తో మహేష్..?

సూపర్ స్టార్ మహేష్ బాబు గతంలో కంటే స్పీడ్ అయ్యాడు..ఓ పక్క వరుస సినిమాలు చేస్తూనే మరోపక్క వివిధ రంగాల్లో అడుగులేస్తూ బిజీ బిజీ గా గడుపుతున్నాడు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్లో మహర్షి సినిమా చేస్తున్నాడు. మే 09 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తర్వాత పటాస్ ఫేమ్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో మరో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడని ఓ పక్క ప్రచారం జరుగుతుండగా..తాజాగా మరో డైరెక్టర్ పేరు వార్తల్లోకి వచ్చింది.

కన్నడలో కేజీఎఫ్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడని ప్రచారం జరుగుతుంది. కేజీఎఫ్ చిత్రం తో ఒక్కసారిగా అన్ని భాషల్లో ఫేమస్ అయినా ఈయన…ప్రస్తుతం కేజీఎఫ్ సీక్వెల్ తెరకెక్కించే పనిలో బిజీ గా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే మహేష్ కోసం ఓ అద్భుతమైన కథను సిద్ధం చేసాడని అంటున్నారు. ఇప్పటికే ఈ కథను మహేష్ భార్య నమ్రత వినిపించినట్టు తెలుస్తోంది. మరి ఈ కథ మహేష్ కు నచ్చుతుందా..లేదా అనేది చూడాలి.