అ దర్శకుడు మహేష్’కు దగ్గరి దారి వెతికాడా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్ట్ చేయాలని ఏ దర్శకుడికి ఉండదు. ఆ లక్ష్యంతోనే ఉన్నాడట ‘అ’ దర్శకుడు ప్రశాంట్ వర్మ. ‘అ’లాంటి విభిన్నమైన సినిమాతో ఆకట్టుకొన్న దర్శకుడు ఇతడు. ఆ తర్వాత మధ్యలో ఆగిపోయిన తెలుగు క్వీన్ ని టేకప్ చేశాడు. ప్రస్తుతం సీనియర్ హీరో రాజశేఖర్ ‘కల్కీ’గా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమాతో ప్రశాంత్ ప్రతిభ పూర్తిగా అంచనా వేయొచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

ఐతే, ఈ సినిమా కంటే ముందు ఓ వెబ్‌ సిరీస్‌ కూడా డైరెక్ట్‌ చేసే ప్లాన్‌లో ఉన్నారట ప్రశాంత్ వర్మ. ఈ వెబ్‌ సిరీస్‌ను ఘట్టమనేని మంజుల నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ వెబ్‌ సిరీస్‌కి సంబంధించిన కథా చర్చలు నడుస్తున్నాయని సమాచారం. మంజుల నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ ని మహేశ్ బాబు తప్పక ప్రమోట్ చేస్తాడు. ఆ సమయంలో ప్రశాంత్ వర్మ టాలెంట్ మహేష్ కు తెలుస్తుంది. ఈ క్రమంలో మహేష్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టొయొచ్చన్నది ఈ కుర్ర దర్శకుడి ప్లాన్ లా కనిపిస్తుందని చెప్పుకొంటున్నారు. అయి ఉండొచ్చేమో.. !