బాలీవుడ్ కి ‘ప్రస్థానం’ ?

sanjay-dutt

‘వెన్నల’ సినిమాతో ఆకట్టుకున్నాడు దర్శకుడు దేవాకట్టా. అయితే రెండో సినిమాగా తీసిన ‘ప్రస్థానం’ మాత్రం అతనికి విశేష గుర్తింపు తెచ్చిపెట్టింది. 2010లో వచ్చిన ‘ప్రస్థానం’ చిత్రం మంచి విజయం అందుకొంది. రాజకీయ నేపథ్యంతో దేవకట్ట ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో శర్వానంద్‌, సాయికుమార్‌ సందీప్‌ కిషన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

అయితే ఈ చిత్రం ఇప్పుడు బాలీవుడ్‌ కి వెళుతుంది. ఈ సినిమా సంజయ్‌ దత్‌కి తెగ నచ్చేసిందట. అందుకే ఈ సినిమాని హిందీలో రీమేక్‌ చేయాలనుకుంటున్నారు. హిందీలో ‘జిల్లా ఘజియాబాద్‌’, ‘కాంటే’, ‘ఖల్నాయక్‌’ వంటి థ్రిల్లర్‌ చిత్రాల్లో నటించిన సంజయ్‌.. ‘ప్రస్థానం’ చిత్రానికి తానే నిర్మాతగా వ్యవహరిస్తూ నటించాలనుకుంటున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. అయితే దీనిపై అధికారికి ప్రకటన రావాల్సివుంది.