తెలుగు సినిమాకు ఓకే చెప్పిన ప్రియా ప్రకాష్.. !

కనుసైగలతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్. ఇప్పుడీ హీరోయిన్ కోసం దర్శక-నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈ పోటీలో టాలీవుడ్ నిర్మాతలు కూడా ఉన్నారు. ఆ మధ్య యంగ్ హీరో నిఖిల్ సినిమా కోసం ప్రియాని ట్రై చేసినట్టు వార్తలొచ్చాయ్. కానీ, వర్కవుట్ కాలేదనే టాక్ వినిపించింది. ఐతే, ఫైనల్ ప్రియా ప్రకాష్ ఓ తెలుగు సినిమాకు సంతకం చేసినట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్.

ప్రియా కోసం ట్రై చేసిన వారిలో నిర్మాత దిల్ రాజు, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పేర్లు వినిపించాయి. వీరే కాకుండా మరో పేరున్న బ్యానర్ ప్రియా కోసం ట్రై చేసి సక్సెస్ అయినట్టు సమాచారమ్. ఆ బ్యానర్ ఏంటీ ? ఆ సినిమా వివరాలు ఏంటీ ?? అనేది త్వరలోనే తెలియనున్నాయి. ఇక, ఆమె నటించిన తొలి సినిమా ‘ఒరు అదార్ ల‌వ్’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.