‘ఆర్ఆర్ఆర్’లో ప్రియమణి ?

రాజమౌళి మల్టీస్టారర్ #ఆర్ఆర్ఆర్ ఇటీవలే మొదలైంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో హై టెక్నాలజీతో తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాడు రాజమౌళి. ఇందులో తారక్, చరణ్ లు డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్టు చెబుతున్నారు. ఇప్పుడీ లుక్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. తాజాగా, ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది.

ఇందులో సీనియర్ హీరోయిన్ ప్రియమణిని కీలక పాత్ర కోసం తీసుకొన్నట్టు సమాచారమ్. రాజమౌళి దర్శకత్వంలో ‘యమదొంగ’ చిత్రంలో ప్రియమణి నటించింది. ఆమె టాలెంట్ తెలిసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ కోసం తీసుకొన్నాడట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక, ‘ఆర్ఆర్ఆర్’ కోసం 4జీ టెక్నాలజీ, 4డి సౌండ్ వాడబోతున్నారు. రాజమౌళి డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ ఊహించని రేంజ్ లో ఉండబోతున్నాయట. వాటిని ఏకంగా 120 కెమెరాలతో చిత్రీకరించబోతున్నారు.