బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ముక్కుమీద కోపం చూపిస్తోంది. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈ మధ్య హాలీవుడ్ లోనూ ఫేమస్ అయిపోయింది. యుఎస్ ‘క్వాంటికో’ టీవీ సీరియల్స్ తో ప్రపంచ వ్యాప్తంగా పేరు... హీరోయిన్ ‘ముక్కు’ మీద కోపం..

Priyanka-Chopra

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ముక్కుమీద కోపం చూపిస్తోంది. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈ మధ్య హాలీవుడ్ లోనూ ఫేమస్ అయిపోయింది. యుఎస్ ‘క్వాంటికో’ టీవీ సీరియల్స్ తో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకొన్న.. ఈ ముద్దుగుమ్మ హాలీవుడ్ చిత్రంలో నటించే ఆఫర్ ని కొట్టేసింది. అయితే, ఇప్పుడీ ముద్దుగుమ్మ తనపై వచ్చిన ఓ గాసిప్ పై తీవ్ర కోపం చూపిస్తోంది.

ఇంతకీ ప్రియాంక ఆగ్రహానికి గురిచేసిన ఆ గాసిప్ న్యూస్ ఎంటీ.. ? అంటే.. ఈ మధ్య ప్రియాంక చోప్రా ముక్కుకి సర్జరీ చేసుకుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజా ఈ ప్రచారంపై స్పందించింది ప్రియాంక. ముక్కు ప్రచారంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ” నేను ముక్కు సర్జరీ చేయించుకున్నట్లు వస్తోన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ఇది నా ఒరిజినల్ ముక్కు. మహిళలు ఎలా ఉండాలో మరియు వారి బాడీ షేపులు ఎలా ఉండాలనే దాని గురించి సమాజంలో ఓ నీచమైన తప్పుడు అభిప్రాయం నెలకొనివుంది” అంటూ చీవాట్లు పెట్టింది.

ఇండస్ట్రీలో ప్రియాంకతో పాటు.. కంగనా రనౌత్, వాణి కపూర్, శిల్పా శెట్టి, అనుష్క శర్మ , కరీనా కపూర్.. తదితరులు అదనపు అందం కోసం సర్జరీలు చేసుకొన్నట్టు ప్రచారం జరిగింది. ఇక, టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముక్కు సర్జరీ చేయించుకొన్నాడనే ప్రచారం జోరుగా జరిగిన విషయం తెలిసిందే.

Indywood Film Carnival
లేటెస్ట్ గాసిప్స్