ఆ హీరోతో పెళ్లికి ఓకే చెప్పిన ప్రియాంక.. !!

sid-priyanka

బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో బిజీ అయిపోయింది ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా. ఈ బిజీలో లవ్, డేటింగ్ విషయాలని కూడా ప్రక్కన పెట్టేసింది. అయితే, ఉన్నట్టు ఓ బాలీవుడ్ యంగ్ హీరోతో పెళ్లికి ఓకే చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

యంగ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా – అలియా భట్‌ లు ఇటీవలే బ్రేకప్ చెప్పుకొన్నారు. ఇప్పుడీ హీరో ప్రియాంక చోప్రాకి ప్రపోజల్ చేయడం.. దానికి ఆమె ఓకే చెప్పడం జరిగిపోయాయి. ఇప్పుడంతా వీరి లవ్ ప్రపోజల్ గురించే చర్చించుకొంటున్నారు. అయితే, ఇది రీల్ లైఫ్ లో కాదు. వీరిద్దరు కలసి ఓ వాణిజ్య ప్రకటన చేశారు.

ఆ ప్రకటనలో.. ‘సిద్ధార్థ్‌ చేసిన పెళ్లి ప్రపోజల్‌కు ప్రియాంక నవ్వులు చిందిస్తూ ఒప్పుకుంది’. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది.
దీంతో.. ఈ జంట నిజంగానే లవ్ ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై సిద్ధార్థ్ స్పందిస్తూ.. ‘అందరూ నువ్వు నా ప్రపోజల్‌కు ఓకే చెప్పావని అనుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉంది కదా’ అంటూ ప్రియాంకకి ట్విట్ చేశాడు. అందుకు బదులుగా.. ‘నీ గురించి కాదు గానీ, నా గురించి నా ఉంగరం గురించి అందరూ మాట్లాడుతున్నారు’ అంటూ రీ-ట్విట్ చేసింది ప్రియాంక. ఈ ట్విట్లు ఇక్కడితోనే ఆగుతాయా.. నిజంగానే పెళ్లి ట్విట్స్ వరకు వెళతాయా.. ? అనేది చూడాలి.