aravind-dil raju-suresh
ఈ సంక్రాంతికి రెండు క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మెగాస్టార్ ‘ఖైదీ నెం. 150’, బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, శర్వానంద్ ‘శతమానం భవతి’, ఆర్ నారాయణ మూర్తి ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ చిత్రాలు బాక్సాఫీస్ యుద్ధానికి దిగనున్నాయి.

సినిమా వసూళ్లలో నైజాం ఏరియాలో చాలా కీలకం. నైజాంలో ఎక్కువ థియేటర్స్ దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్ చేతిలో ఉన్నాయి. వీరిలో సురేష్ బాబు గౌతమీపుత్ర శాతకర్ణి సపోర్ట్ గా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. అల్లు అరవింద్ ఖైదీ నెం.150కి దండుగా ఉన్నారు. దిల్ రాజు శతమానం భవతి సినిమాని వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే, ఈ బడా నిర్మాతలంతా కలసి ఓ సెటిల్మెంట్ చేసుకొన్నట్టు సమాచారమ్. ఫస్ట్ వీక్ టాక్ బట్టీ గుడ్ టాక్ తెచ్చుకొన్న సినిమాకి థియేటర్స్ పెంచాలని.. టాక్ బట్టి ఏ సినిమాకి నష్టం కాకుండా థియేటర్స్ అడ్జెస్ట్ చేయాలని తీర్మాణించినట్టు తెలుస్తోంది. మొత్తానికి బడా నిర్మాతల సెటిల్మెంట్ అదిరిపోయింది.

లేటెస్ట్ గాసిప్స్