పవన్ టైటిల్ ‘అజ్ఞాతవాసి’.. ఫిక్స్ !

pawan-anu

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. జెడ్-స్వీడుతో చిత్రీకరణ జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా వచ్చే యేడాది జనవరి 10న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే, ఇప్పటికీ ఈ సినిమా టైటిల్ ఫిక్స్ కాలేదు. ప్రచారంలో మూడ్నాలుగు టైటిల్స్ ఉన్నాయి. ఇంజనీరు బాబు, పరదేశి ప్రయాణం, అజ్ఝాతవాసి, గోకుల కృష్ణుడు.. టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారమ్ ప్రకారం పవన్ 25వ సినిమా కోసం ‘అజ్ఞాతవాసి’ టైటిల్ ని ఫిక్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ టైటిల్ ఇప్పటికే చిత్రబృందం ఖరారు చేసింది. దీపావళీ కానుకగా టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేయబోతున్నారని చెబుతున్నారు. మరీ.. ఈ ప్రచారంలో నిజమెంత ? అనేది వేచి చూడాలి.

పవన్ – త్రివిక్రమ్ సినిమా అంటే ఆ క్రేజీయే వేరు. వీరి కలయికలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. టాలీవుడ్ కి వందకోట్ల దారిని చూపించిన ఘనత వీరిది. ఈ క్రమంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పవన్ 25వ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ లు జతకట్టనున్నారు. సంగీతం అనిరుధ్. రాథాకృష్ణ నిర్మాత.