త్రివిక్రమ్ ని కాపీ కొట్టిన పూరి


త్రివిక్రమ్ సెంటిమెంట్ ని దర్శకుడు పూరి కాపీ కొట్టినట్టు కనబడుతోంది. అజ్ఝాతవాసి, అరవింద సమేత కోసం త్రివిక్రమ్ కుర్చీ సెంటిమెంట్ ఫాలో అయిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల ఫస్ట్ లుక్స్ హీరో కుర్చీతో ఉన్న పోస్టర్స్ ని వదిలారు. అరవింద సమేత విషయంలో ఈ సెంటిమెంట్ నందమూరి అభిమానులని భయపెట్టింది. అదృష్టవశాత్తు.. అజ్ఝాతవాసి రిజల్ట్ అరవింద సమేతకు రిపీట్ కాలేదు. ఇప్పుడు పూరి కూడా కుర్చీ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారు.

రామ్ తో పూరి చేయబోతున్న సినిమాని ‘ఇస్మార్ట్ శంకర్’ టైటిల్ ని పెట్టారు. గురువారం ఇస్మార్ట్ శంకర్ మోషన్ పోస్టర్ వదిలారు. ఈ సందర్భంగా వదలిన ఓ పోస్టర్ రామ్ చరణ్ లో కూర్చొని కనిపించాడు. దీంతో పూరి కూడా త్రివిక్రమ్ ని ఫాలో అవుతున్నారని చెప్పుకొంటున్నారు. మరీ.. కుర్చీ సెంటిమెంట్ పూరిని ముంచుతుందా.. ? లేపుతుందా.. ?? అనేది చూడాలి.