పూరి అందులో నుండి బయటకు రాలేకపోతున్నాడా..?

పూరి జగన్నాథ్‌..ఈ పేరు చెపితే చాలు బ్లాక్ బస్టర్ హిట్లు గుర్తుకొస్తాయి..బద్రి మొదలు కొని పోకిరి వరకు వరుస హిట్లు అందుకో డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు ఆయన నుండి సినిమా వస్తుందంటే బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేది. కానీ ఇప్పుడు అంత మారిపోయింది. ఆయన సినిమా అంటే షేక్ అవ్వడమేమో కానీ పోస్టర్ ఖర్చులు కూడా రాక నిర్మాతల తలలు షేక్ అవుతున్నాయి.

ఎప్పుడో పదేళ్ల కిందటి కథలే నమ్ముకుని సినిమాలు తీస్తుండడం తో వరుస ప్లాపులు ఆయన్ను వెంటాడుతున్నాయి. నిన్న మొన్న ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన వారంతా ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్లు కథలు రాసుకుంటూ సూపర్ హిట్లు కొడుతుంటే పూరి మాత్రం అక్కడే ఉండిపోయాడు. తన కొడుకు తో చేసిన సినిమా సైతం భారీ ప్లాప్ కావడం తో పూరి కాస్త గ్యాప్ తీసుకున్నాడు.

తాజాగా హీరో రామ్ తో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ అనే సినిమా చేయబోతున్నాడు. రీసెంట్ గా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసాడు. రామ్‌ వేషధారణ, అతని డైలాగ్‌ డెలివరీ, డబుల్‌ సిమ్‌కార్డ్‌ ఇవన్నీ కూడా పూరీ మార్కు ‘లోఫర్‌’, ‘ఇజం’ తరహానే అనిపిస్తుంది. మరి ఈ చిత్రం కూడా గత చిత్రాల మాదిరిగానే తెరకెక్కిస్తాడా..లేక కొత్తదనం చూపిస్తాడా అనేది చూడాలి.