దర్శకేంద్రుడితో వెంకీ ?


భక్తిరస చిత్రాలను తెరకెక్కించడంలో ‘దర్శకేంద్రుడు’ దిట్ట. అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘శిరిడీ సాయి’, ‘ఓం నమోవేంకటేశాయ’ చిత్రాలతో అలరించారు. ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలోనే మరో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.

ఇందులో విక్టరీ వెంకటేశ్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం రాఘవేంద్రరావు స్క్రిప్ట్‌పై కసరత్తు చేస్తున్నారని, త్వరలోనే ఈ సినిమా ప్రకటన ఉటుందనే కబర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా సెట్స్ పైకే వెళ్ళే అవకాశాలుఇప్పట్లో కనిపించడం లేదు. ప్రస్తుతం వెంకీ, తేజ సినిమాతో బిజీగా వున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా వుటుంది. ఈ రెండు సినిమాలు ఫినిష్ అయిన తర్వాతే కొత్త సినిమా. మరి ఈ గ్యాప్ లో ఈక్వేషన్స్ ఎలా మారిపోతాయో చూడాలి.