అనిల్’తో రాజమౌళికి పోలికా.. టూ మచ్ !


దర్శకధీరుడు రాజమౌళిని ‘ఎఫ్ 2’ దర్శకుడు అనిల్ రావిపూడితో పోల్చడం నవ్వుని తెప్పిస్తున్నాయి. ఇంతకీ ఏ విషయంలో ఈ పోలికా అంటారా.. ? అనిల్ దర్శకత్వంలో వెంకీ, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా వచ్చిన ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అసలైన సంక్రాంత్రి సినిమాగా నిలిచింది.

ఈ చిత్రంలో హీరోలు ఇద్దరికీ తెలంగాణ, ఆంధ్రా స్లాంగ్ ఇచ్చాడు అనిల్. అది చక్కగా కుదిరింది. ఇప్పుడు రాజమౌళి కూడా ఇదే శైలి లో తన హీరోలని జనాల్లో కి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ ని అల్లూరి, కొమరంభీమ్ కథగా తెరకెక్కిస్తున్నారు జక్కన్న. అల్లూరిది ఆంధ్రాప్రాంతం, కొమరం భీమ్ తెలంగాణకు చెందిన వ్యక్తి. ఈ నేపథ్యంలో జక్కన్న అనిల్ ని ఫాలో అవుతున్నారని సరదాగా చెప్పుకొంటున్నారు.