సౌత్ లో భారీ చిత్రం అంటే శంక‌ర్ పేరు మాత్ర‌మే వినిపించేది. ఇప్పుడు రాజ‌మౌళి పేరు మారుమ్రోగుతోంది. బాహుబలితో రాజ‌మౌళి పేరు భారీ చిత్రాల దర్శకుల లిస్టులో చేరిపోయింది. ప్రస్తుతం ఈ ఇద్దరు... రాజ‌మౌళి వర్సెస్ శంకర్.. గెలిచేదెవరు ?

rajamouli-shankar

సౌత్ లో భారీ చిత్రం అంటే శంక‌ర్ పేరు మాత్ర‌మే వినిపించేది. ఇప్పుడు రాజ‌మౌళి పేరు మారుమ్రోగుతోంది. బాహుబలితో రాజ‌మౌళి పేరు భారీ చిత్రాల దర్శకుల లిస్టులో చేరిపోయింది. ప్రస్తుతం ఈ ఇద్దరు దర్శకులు భారీ బడ్జెట్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాజ‌మౌళి ‘బాహుబలి 2’ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు రూ. 350కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రమిది. రూ. 1000 కోట్ల వసూళ్లని టార్గెట్ గా పెట్టుకొంది.

మరోవైపు, శంకర్ రోబో 2 కోసం రూ. 350కోట్ల బడ్జెట్ అనుకొంటే.. అది కాస్త రూ. 500కోట్లకి చేరింది. అయితే, రోబో 2 రూ. 1100కోట్ల వసూళ్లని టార్గెట్ గా పెట్టుకొంది. ఇప్పటికే రోబో 2 కి శాటిలైట్ రూపంలో రూ. 110కోట్లు వచ్చాయి. సౌత్ లో ఇదో రికార్డ్. ఇప్పుడు బాహుబలి 2, రోబో 2లో అత్యధిక వసూళ్లు రాబట్టే సినిమా ఏదని బెట్టింగులు మొదలైనట్టు చెబుతున్నారు.

అత్యధిక వసూళ్లు రాబట్టడంలో రాజ‌మౌళి, శంకర్ లలో ఎవరు గెలుస్తారన్నది చూడాలి. అన్నట్టు.. రోబో 2 దీపావఌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Indywood Film Carnival
లేటెస్ట్ గాసిప్స్