సర్కార్’ గెస్టుగా రజనీ !

విజయ్‌ – మురుగదాస్‌ లది హిట్ కాంబో. వీరి కాంబోలో వచ్చిన తుపాకి, కత్తి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వీరి కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘సర్కార్’. విజయ్‌ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. మరో కీలక పాత్రలో హీరోయిన్ వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కనిపించనున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. మరోవైపు, సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. అక్టోబర్‌ 2న ఆడియో ఫంక్షన్ ని ప్లాన్ చేశారు. ఈ వేడుకకు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారట.

పొలిటికల్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేటుని ఫిక్స్ చేశారు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్‌ 13న విజయ్‌ సర్కార్‌ టీజర్‌ను రిలీజ్‌ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా లాస్‌ వేగాస్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాను సన్‌ పిక్చర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.