rajtarun
యంగ్ హీరో రాజ్ తరుణ్ తప్పడగుతుల నుంచి తేరుకొన్నాడని ఫిల్మ్ నగర్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వరుసగా హిట్స్ పై పడటంతో ఈ కుర్ర హీరోకి తలెక్కిందని.. ఆ కారణంగానే శతమానం భవతి, నేను లోకల్, లేడీస్ టైలర్ సీక్వెల్.. తదితర సినిమాలు మిస్ చేసుకొన్నాడని సమాచారమ్. రాజ్ తరుణ్ జారవిడుకొన్న కొన్ని సినిమాలు పెళ్లి చూపులు ఫేం విజయ్ దేవరకొండ రెండు చేతుల్లా అందిపుచ్చుకొన్నాడట.

అయితే, తప్పటడుగుల నుంచి ఇప్పుడు రాజ్ తరుణ్ తేరుకొన్నట్టు చెబుతున్నారు. నేరుగా కాకున్నా.. మధ్యవర్థుల ద్వారా ఇండ్రస్ట్రీలో కొంతమందిని కలుస్తున్నాడని.. కొత్త ప్రాజెక్టులు సెట్ అయ్యేలా చొరవ తీసుకొంటున్నాడని సమాచారమ్.

ప్రస్తుతం రాజ్ తరుణ్ ‘కిట్టు వున్నాడు జాగ్రత్త’తో బిజీగా ఉన్నాడు. దీంతో పాటుగా మరో రెండు ప్రాజెక్టులు సెట్స్ పై ఉన్నాయి. అయితే, ఈ కుర్ర హీరో అతి తక్కువ కాలంలోనే ఇండ్రస్ట్ర్రీ లో రాజకీయాలు ఎలా ఉంటాయని ఒంటబట్టించుకొన్నట్టు.. ఇకపై రాజ్ తరుణ్ తప్పటడుగులు వేయడం జరగదని ఆయాన్ సన్నిహితులు చెబుతున్నారు.

లేటెస్ట్ గాసిప్స్