పారితోషికంపై రకుల్ ఫైట్.. !

rakul

హీరోయిన్స్ పారితోషికం పెంచాల్సిందే అంటోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. హీరోలతో పోలిస్తే హీరోయిన్స్’కి ఇచ్చే పారితోషికం చాలా తక్కువే. ఈ విషయంపై చాలా మంది అసంతృపిని వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడీ లిస్టులో రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరిపోయింది. ఆమె హీరోయిన్ల పారితోషికం పెరగాలనే పట్టుబడుతోంది. దక్షిణాదిన అత్యథిక పారితోషికం తీసుకొంటున్న హీరోయిన్ గా నయనతారని చెబుతుంటారు.

ఆమెకు మహా అంటే రూ. 3కోట్లు ఇస్తుండవచ్చు. అది తక్కువే. లేడీ సూపర్ స్టార్ అనిపించుకొంటున్న నయన్ విషయంలో ఆ పారితోషికం తక్కువేనని చెబుతుంది. ఇంతకీ రకుల్ ఎంత పారితోషికం తీసుకుంటున్నట్టు అంటే… తన శ్రమకి తగినంత అని చెప్పుకొచ్చింది. అన్నట్టు వరుస సినిమాలు చేసి అలసిపోయిన రకుల్ ఓ నెల పాటు విశ్రాంతి తీసుకోనుంది.