శ్రీదేవి బయోపిక్ లో రకుల్ ?

క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. తొలిభాగం ఎన్టీఆర్-కథానాయకుడు రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అతిలోక సుందరి శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఎన్టీఆర్-శ్రీదేవి కలయికలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. అందులోనూ అదిరిపోయే డ్యూయెట్స్ ఉన్నాయి. వాటిని ఎన్ టీఆర్ కథానాయకుడులో చూడబోతున్నాం.

మరోవైపు, బాలీవుడ్ లో శ్రీదేవి బయోపిక్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆమె భర్త బోనీకపూర్ ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఆయనే దర్శకుడు-నిర్మాతగా కూడా వ్యవహరిస్తారని తెలుస్తోంది. శ్రీదేవి పాత్రలో ఎవరు కనిపిస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఐతే, రకుల్ ప్రీత్ సింగ్ ఓ మంచి ఆప్షన్ గా మారిందని చెప్పవచ్చు. రేపు ఎన్ టీఆర్ కథానాయకుడులో రకుల్ శ్రీదేవిగా మెప్పిస్తే. శ్రీదేవి బయోపిక్ లోనూ ఆమెకి అవకాశం రావొచ్చు.