రకుల్ బిస్కెట్ వేస్తోంది

rakul

కెరీర్ స్టార్టింగ్ లో కుర్ర హీరోలతో జతకట్టిన రకుల్ ప్రీత్ సింగ్.. ఆ తర్వాత స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది. స్టార్ హీరోయిన్ రేంజ్’కి చేరుకొంది. గత నాలుగేళ్లుగా వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది. ఇప్పుడు అలసిపోయాను.. విశ్రాంతి కావాలంటోంది. నేను అలసిపోవడం గమనించి విశ్రాంతి తీసుకోవాలని ఇంట్లో వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో ఓ నెల పాటు విశ్రాంతి తీసుకోబోతున్నానని చెబుతోంది.

అయితే, అసలు విషయం ఇది కాదని అంటున్నారు. ప్రస్తుతం రకుల్ చేతిలో సినిమాలేవీ లేవు. ఇప్పటికే రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. అవి మొదలయ్యె వరకు మరో రెండు నెలలు పట్టనుంది. ఈ నేపథ్యంలో ఖాళీ ఉంటే బోలేడు పుకార్లు పుట్టుకొస్తాయని ముందే గ్రహించిన రకుల్.. అలసిపోయాను, విశ్రాంతి అవసమని బిస్కెట్స్ వేస్తోంది.