మల్టీస్టారర్ చిత్రానికి రామ్ గ్రీన్ సిగ్నల్..

హీరో రామ్ సినీ కెరియర్ ఏమాత్రం బాగాలేదని చెప్పాలి..వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు. రెండేళ్ల క్రితం నేను శైలజ చిత్రం తో మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లు అనుకునేలోపు హైపర్ , ఉన్నది ఒకటే జిందగీ చిత్రాలతో మళ్లీ ప్లాప్స్ చవిచూశాడు. ప్రస్తుతం నేను లోకల్ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో ‘హలో గురు ప్రేమ కోసమే’ అనే చిత్రం చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు.

ఈ సినిమా తర్వాత రామ్ ఓ మల్టీస్టారర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఓ తమిళ్ స్టార్ తో రామ్ కలిసి నటించనున్నారు. అయితే ఆ హీరో ఎవరనేది ఇంకా తెలియ లేదు. ప్రస్తుతం ఆ సినిమాకి సంబందించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ చిత్రాన్ని స్రవంతి రవి కిషోర్ నిర్మించబోతున్నట్లు వినికిడి.