#ఆర్ఆర్ఆర్’లోనూ శివగామి !

రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మల్టీ స్టారర్ ను ప్రారంభించిన విషయం తెల్సిందే. ఇందులో తారక్, చరణ్ లు కథానాయకులుగా నటిస్తున్నారన్న విషయం మాత్రమే తెలుసు. హీరోయిన్స్, ఇతర నటీనటులు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఐతే, హీరోయిన్స్ పేర్లు ప్రకటించేందుకు రాజమౌళి స్పెషల్ డేట్ ఫిక్స్ చేశారు. అదే 12 12 12 అని చెప్పుకొంటున్నారు.

ఐతే, ఇప్పుడీ సినిమా గురించి మరో పుకారు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదే ఆర్ఆర్ఆర్ లోనూ రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతుందట. బాహుబలి చిత్రంలో శివగామి పాత్ర పోషించి సినిమా స్థాయిని పెంచిన రమ్యకృష్ణను మరో సారి తన సినిమాలో భాగస్వామ్యం చేయాలని రాజమౌళి బలంగా కోరుకుంటున్నాడట. ఆమె కోసం ఒక ప్రత్యేక పాత్రను డిజైన్ చేయించాడట.
ఇందులో నిజమెంత ? అనేది తెలియాల్సి ఉంది.

ఇక, ఈ సినిమా మొదటి షెడ్యూల్ మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. త్వరలోనే మొదలు కానున్న రెండవ షెడ్యూల్ లో హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా పాల్గొనబోతున్నారంట. ఈలోపే ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్స్ ఎవరన్నది రాజమౌళి ప్రకటించబోతున్నారు.