రవితేజ సరసన ఆ ముగ్గురు…

గత ఏడాది రాజా ది గ్రేట్ తో సక్సెస్ కొట్టిన రవితేజ..నిన్న రిలీజ్ అయినా టచ్ చేసి చూడు చిత్రం తో మాత్రం ప్లాప్ చవిచూసాడని తెలుస్తుంది. ఎందుకంటే ఈ మూవీ కి అన్ని చోట్ల నెగిటివ్ టాక్ రావడం తో ఆల్మోస్ట్ దీనిని ప్లాప్ కిందకే అనే మాట బాగా ప్రచారం అవుతుంది. ప్రస్తుతం సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో నేల టికెట్ తో పాటు శ్రీను వైట్ల దర్శకత్వం లో మరో మూవీ చేస్తున్నాడు.

ఫిలిం నగర్ సమాచారం మేరకు ఈ మూవీ లో రవితేజ ట్రిపుల్ రోల్ చేయబోతున్నాడట. ఇది తనకు మొదటిసారి. ప్రస్తుతం హీరొయిన్ల సెలక్షన్ జరుగుతోందట. కాజల్ అగర్వాల్ ఒక హీరోయిన్ గా ఫిక్స్ చేశారట.రెండో హీరొయిన్ గా నివేదా థామస్ తో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. మరో హీరొయిన్ గా అనుపమ లేదా అను ఇమ్మానియేల్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరినైనా ఒకరిని ఫైనల్ చేయబోతారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి అమర్ అక్బర్ అంటోనీ అనే టైటిల్ పెట్టబోతున్నారని చాల రోజులుగా ప్రచారం జరుగుతుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మించబడుతుంది.