మాస్ రాజా డైరెక్టర్ గా మారబోతున్నాడా..?

ఇప్పుడు ఇదే ఫిలిం సర్కిల్లో చర్చ గా మారింది. గత కొంతకాలంగా సరైన హిట్ లేని రవితేజ..ప్రస్తుతం విఐ ఆనంద్ డైరెక్షన్లో డిస్కో రాజా అనే చిత్రం చేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో మొదలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో రవితేజ త్వరలో డైరెక్టర్ గా మారబోతున్నాడనే వార్త చక్కర్లు కొడుతుంది.. వాస్తవానికి రవితేజ హీరో కాకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఛాన్సులు రావడం అక్కడి నుండి హీరో గా అవకాశాలు రావడం తో తనలోని డైరెక్టర్ ఆలా ఉండిపోయాడు.

ఇక ఇప్పుడు ఆ డైరెక్టర్ ను బయటకు తీసేందుకు సిద్దమవుతున్నాడట. నందమూరి కళ్యాణ్ రామ్ కు ఓ కథను రవితేజ ఈ మధ్యనే వినిపించాడని ..ఆ కథ విన్న కళ్యాణ్ రామ్ బాగా ఇంప్రెస్ అయి తన బ్యానర్ లోనే ఈ సినిమా చేద్దాం అని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కళ్యాణ్ రామ్ నిర్మాణంలో కిక్ 2 సినిమా చేసాడు. మరి రవితేజ డైరెక్టర్ కాబోతున్నాడనే వార్త ఎంత వరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.