‘భైరవగీత’ని బ్లాక్ బస్టర్ చేసే ప్లాన్ లో వర్మ !


ఈ మధ్య బోల్డ్ కంటెంట్ తో వచ్చిన సినిమాలకి మంచి ఆదరణ లభిస్తోంది. బోల్డ్ కంటెంట్ తెరకెక్కిన అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్100 బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. విడుదలకి రెడీగా ‘భైరవగీత’ కూడా ఇదే తరహా సినిమా. ‘ఆర్ఎక్స్100’ మించిన బోల్డ్ కంటెంట్ తో భైరవగీతలో ఉందని సమాచారమ్. ఇప్పుడిదే బలంగా భావిస్తున్నారు రాంగోపాల్ వర్మ.

అందుకే అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 తరహా భైరవగీతని బ్లాక్ బస్టర్ హిట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడట. ఇందులో భాగంగానే సినిమాని సింగిల్ విడుదల చేయడానికి ప్లాన్ చేశాడట. మొదట ‘2.ఓ’కి పోటికి దించుదామని భావించినా సరిపోను థియేటర్స్ దక్కవని వెనకడుగు వేశాడట. డిసెంబర్ 7న అనుకొన్నా.. ఆ రోజు మిడియం బడ్జెట్ సినిమాలు థియేటర్స్ క్యూ కట్టాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి పోటీ లేకుండా డిసెంబర్ 14న భైరవగీతని తీసుకురావాలని వర్మ భావిస్తున్నారు. మరీ.. వర్మ ప్లాన్ వర్కవుట్ అయి భైరవగీత బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందేమో చూడాలి.