చరణ్, తారక్ విడుదల అప్పుడే !


‘బాహుబలి’ సినిమా కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దాదాపు ఐదేళ్ల కాలాన్ని కేటాయించారు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ కోసం కూడా రామ్ చరణ్, ఎన్టీఆర్ లు పెద్ద మొత్తంలో కాల్షీట్లు ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ నుంచి తారక్, చరణ్ ఎప్పుడు విడుదల కానున్నారు అన్నది చర్చనీయాంశం అయ్యింది. దీనిపై ఇటీవల రాజమౌళి క్లారిటీ ఇచ్చేసినట్టు సమాచారమ్.

#ఆర్ఆర్ఆర్ షూటింగ్ ని ఈ యేడాది నవంబర్ కల్లా పూర్తి చేయాలనే ప్లాన్ లో ఊన్నారు. ఏవైనా అనివార్యకారణాల వలన షూటింగ్ లో జాప్యం జరిగినా.. డిసెంబర్ ఆఖరికల్లా సినిమా పూర్తవ్వవచ్చు. ఈ నేపథ్యంలో వచ్చే యేడాది అంతే.. 2020 జనవరి నుంచి కొత్త సినిమాలకి డేట్స్ ఇచ్చుకోండని జక్కన్న చరణ్, తారక్ లకి సూచించినట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా హీరోయిన్స్ విషయానికొస్తే… ఓ హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ని తీసుకొన్నారని తెలిసిందే. ఆమె రామ్ చరణ్ కి జతగా నటించనుందట. ఎన్ టీఆర్ కోసం ఫారిన్ బ్యూటీని తీసుకొనే ప్రయత్నాల్లో రాజమౌళి ఉన్నట్టు సమాచారమ్.