పాపం.. ‘నా పేరు సూర్య’కు ఆరుకోట్ల నష్టం !

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం “నా పేరు సూర్య”. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే, రిలీజ్ కి ముందు ఈ సినిమా రూ. 6కోట్ల నష్టాలని చవి చూసిందట. అదెలాగా అంటే ?

బన్నీ సినిమాలకు టాలీవుడ్ తో పాటుగా కేరళ, కర్నాటకలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో.. ఆయన సినిమాలకు డబ్బింగ్ రైట్స్ కింద భారీ మొత్తం వచ్చిపడుతుంటుంది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ రూ. 12కోట్లకి అమ్ముడుపోయాయి. ఐతే, ఇప్పుడీ సినిమా డిజిటల్ రైట్స్ కోసం మరో సంస్థ రూ. 18కోట్లకి ఆఫర్ చేసినట్టు సమాచారమ్. ఈ లెక్కన రిలీజ్ కి ముందే ‘నా పేరు సూర్య’కు రూ. 6కోట్ల నష్టం వచ్చినట్టు ఇండస్ట్రీ లో టాక్ నడుస్తోంది.