సాహో సందేహం కలిగిస్తుంది ..

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న చిత్రం సాహో. సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం హాలీవుడ్ స్థాయి లో ఉంటుందనే సంగతి టీజర్ లు చూస్తే అర్ధమవుతుంది. కానీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో మాత్రం ఖచ్చితగా ఎవ్వరు చెప్పలేకపోతున్నారు. ముందు నుండి కూడా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుండడం తో అనుకున్న సమయానికి రిలీజ్ కాలేదు.

కొన్ని రోజుల క్రితం ఆగస్టు 15 న వస్తుందని గట్టిగా చెప్పారు. కానీ ఆ సమయానికి కూడా వస్తుందో రాదో అనే సందేహాలు అందరిలో కలుగుతున్నాయి. దీనికి కారణం షూటింగ్ ఇంకా అయిపోలేదని..ఓ పాట తో పాటు ఓ యాక్షన్ కూడా పెండింగ్ లో ఉందని అంటున్నారు. అవి పూర్తీ చేసి..పోస్ట్ ప్రొడక్షన్ చేసి ఈ మూడు నెలల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అంటే కాస్త కష్టమే అంటున్నారు . మల్టీ లాంగ్వేజ్ వెర్షన్స్ కావడంతో మీడియా రిలేషన్స్ విషయంలో యువీ టీమ్ కాస్త వెనుకబడి ఉంది.

ఇప్పటిదాకా షేడ్స్ అఫ్ సాహో పేరుతో రెండు మేకింగ్ వీడియోలు తప్ప ఇంకేమి బయటికి రాలేదు. ఇప్పుడు చేతిలో ఉన్న అతి తక్కువ గడువుతో సాహో డెడ్ లైన్ మీట్ అవుతుందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. మరి ఈ సస్పెన్స్ కు సాహో ఎలాంటి షాక్ ఇస్తారో చూడాలి.