సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుందట..

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. బాలీవుడ్ నటి శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రన్ రాజా ఫేమ్ సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఆగస్టు 15 న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్న తరుణంలో చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలు పెట్టారట. తాజాగా ఓవర్‌ సీస్‌ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ఓవర్‌ సీస్‌ హక్కులు దాదాపు 42 కోట్లకు అమ్ముడైనట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది తెలియనప్పటికీ అభిమానులు మాత్రం పండగా చేసుకుంటున్నారు. తాజాగా విడుదలైన మేకింగ్ వీడియో 2 సోషల్ మీడియా లో హల్చల్ చేయడమే కాదు హాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది తెలుగు సినేమానా..లేక హాలీవుడ్ సినేమానా అనే స్థాయి లో ఉందని ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.