తేజు జెడ్ స్వీడుతో.. !

మెగా హీరోలు మాస్’కు పెట్టింది పేరు. ఆ పేరుని నిలబెడుతూ జెడ్ స్వీడుతో దూసుకెళ్తున్న మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజు. హిట్టు-ప్లాపులతో తేడా లేకుండా ఆయన సినిమాలు థియేటర్’కు క్యూ కడుతున్నాయి. ఇటీవలే ‘జవాన్’తో సందడి చేశాడు. ఈ వారం ‘ఇంటిలిజెంట్’ రాబోతున్నాడు. మరోవైపు, కరుణాకరణ్ దర్శకత్వంలో తేజు సినిమా రెడీ అవుతోంది.

ఇదిలావుండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు తేజు. విభిన్నమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తేజు ఓ సినిమా చేయబోతున్నాడు. ఇటీవలే యేలేటి తేజుని కలిసి ఓ కథని వినిపించడం.. ఆయన కథని ఓకే చేయడం జరిగిపోయాయి. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఐతే, అనుకోకుండా ఒక రోజు, మనమంతా సినిమా యేలేటి టేస్ట్ తో వచ్చి ప్రేక్షకులని ఆకట్టుకొన్నాయి.