సల్మాన్ కు అద్దె కడుపు కావాలట..

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ప్రభాస్..బాలీవుడ్ అంటే సల్మాన్ ఖాన్ అని వేరే చెప్పాల్సిన పనిలేదు..వయసు పెరుగుతున్న కానీ వీరి మాత్రం ఓ ఇంటివారు కావాలని అనుకోవడం లేదు..ఎప్పుడు పెళ్లి గురించి ప్రస్తావించిన మాట దాటవేస్తున్నారు. తాజాగా సల్మాన్ ఓ సంచలన నిర్ణయానికి వచ్చినట్లు బి టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

సల్మాన్ తండ్రి కావాలని అనుకుంటున్నాడట..ఆలా అని పెళ్లి చేసుకొని తండ్రి కాడట.. సరోగసీ విధానం(అద్దెగర్భం) ద్వారా తండ్రి కావాలని అనుకుంటున్నాడని తెలుస్తుంది. ఈ మధ్య సినీ స్టార్స్ అంత ఈ విధానాన్నే ఫాలో అవుతున్నారు. సల్మాన్ కు పిల్లలంటే చాలా ఇష్టం.. అయితే పెళ్ళి చేసుకునే ఆలోచన మాత్రం లేదట. అందుకే ఇలా ఒక బిడ్డను కంటే తన జీవితంలోకి కొత్త సంతోషం వస్తుందని ఆలోచనతో ఉన్నాడట. ఇప్పటికే తన కుటుంబ సభ్యులతో చర్చించాడట. వైద్యులతో కూడా డిస్కషన్స్ జరిగాయని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సల్మాన్ భారత్ అనే సినిమా చేస్తున్నాడు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచి 70 ఏళ్ల వరకూ దేశంతో పాటే ఎదుగుతూ నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం లాంటి ఆటుపోట్లను దాటుకుంటూ ఓ పరిపూర్ణ జీవితాన్ని అనుభవించిన ‘భారత్‌’ అనే వ్యక్తి కథను తెరపై చూపించనున్నారు. ఇందులో సల్మాన్‌ భారత్‌ పాత్రలో నటిస్తున్నారు. రంజాన్‌ కానుకగా జూన్‌ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.