సమంత-చై.. రిసెప్షెన్లు కూడా రెండు !

samantha chai

టాలీవుడ్ ప్రేమజంట సమంత-చైతన్యలు పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే. ఈ జంట రెండు సార్లు పెళ్లి చేసుకొంది. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది. అత్యంత తక్కువ మంది అతిథుల మధ్య జరిగిన ఈ పెళ్లి వేడుకని అక్కినేని ఫ్యామిలీ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసింది. అయితే, త్వరలో హైదరాబాద్ లో జరగబోయే రిసెప్షన్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది.

చైతూ-సమంతల రిసెప్షన్ కూడా రెండు సార్లు జరగనుందట. హైదారాబాద్ లో నవంబర్ మొదటివారంలో సమంత-చైతూల రిసెప్షెన్ జరగనుంది. అయితే, హైదరాబాద్ తో పాటు చెన్నైలోనూ రిసెప్షన్ నిర్వహించాలని చైతూ తల్లి లక్ష్మీ ఆశపడుతున్నట్టు తెలుస్తోంది. ఆమె చెన్నైలోనే ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులో సమంత-చైల రిసెప్షన్ చెన్నైలో నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ వేడుకకి దగ్గుపాటి ఫ్యామిలీ మొత్తం హాజరుకానుంది.