nagachaithanya-samantha
టాలీవుడ్ ప్రేమజంట నాగ చైతన్య – సమంతలు ఈ యేడాది పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వీరి వివాహం ఆగస్టులో ఉండబోతున్నట్టు ప్రచారం జరిగింది. అయితే, ఈలోపే వీరి నిశ్చితార్థ వేడుకని ఘనంగా నిర్వహించేందుకు అక్కినేని ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారమ్. ఇప్పుడు ముహూర్తం కూడా పెట్టేసినట్టు చెబుతున్నారు. ఈ నెల 29న చైతూ-సమంతల నిశ్చితార్థ వేడుక జరగనున్నట్టు అక్కినేని ఫ్యామిలీ అత్యంత సన్నిహిత వర్గాల సమాచారమ్.

అంతేకాదు.. జవవరి 29న మరో విశేషం కూడా ఉందట. అదే రోజు రానా దగ్గుపాటి నిర్మించబోయే నాగ చైతన్య సినిమా కూడా ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. రానా – చైతూలు కలసి కొత్త బ్యానర్ లో ప్రయోగాత్మక చిత్రాలు నిర్మించేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్ లో తొలి చిత్రంగా నాగచైతన్య హీరోగా రానుంది.

ప్రస్తుతం చైతూ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో చైతూ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది. ఇక, సమంత కోలీవుడ్ లో మూడు సినిమాలు టాలీవుడ్ లో రెండు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు చెబుతున్నారు. ఇందులో అశ్వినీదత్ నిర్మించబోయే మహానటి సావిత్రి బయోపిక్ కూడా ఉంది.

లేటెస్ట్ గాసిప్స్