మీకు తెలుసా ? చైతూ-సమంతల రిసెప్షెన్ జరిగిపోయింది.. !

samantha-chaithu

ఇటీవలే గోవాలో నాగచైతన్య – సమంతల వివాహం హిందూ, క్రైస్తవ సంప్రాదాయాల్లో జరిగిన విషయం తెలిసిందే. వీరి రిసెప్షన్ కూడా రెండు సార్లు జరగనున్నట్టు ప్రచారం జరిగింది. హైదరాబాద్, చెన్నైలలో రిసెప్షన్స్ ని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకొన్నారు. అయితే, ఇప్పటికే చైన్నైలో చైతూ-సమంతల రిసెప్షెన్ జరిగిపోయినట్టు తెలుస్తోంది. ఈ వేడుకని నాగచైతన్య తల్లి లక్ష్మీ తరుపున దగ్గుపాటి సురేష్ బాబు నిర్వహించినట్టు చెప్పుకొంటున్నారు.

పెళ్లి మాదిరిగానే చైనై రిసెప్షన్ కు చాలా తక్కువ మంది అతిథులని ఆహ్వానించినట్టు, ఈ వేడుకలో దగ్గుపాటి ఫ్యామిలీ తెగ ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే, చైన్నై రిసెప్షన్ కు సంబంధించిన మేటరు, ఫోటోలు ఎక్కడ కూడా లీకు కాకుండా సురేష్ బాబు జాగ్రత్త పడినట్టు చెబుతున్నారు.

ఇక, త్వరలోనే హైదరాబాద్ లో జరగనున్న సమంత-చై ల రిసెప్షెన్ వేడుకని నాగార్జున నిర్వహించనున్నారు. ఈ వేడుకకి అక్కినేని, దగ్గుపాటి, సమంత ఫ్యామీస్ తో పాటు, సినీ, రాజయకీయ ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులని ఆహ్వానించబోతున్నట్టు తెలుస్తోంది.