పవన్’తో ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు ?

PAWAN-SANDEEP

విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. కేవలం రూ. 4కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 40కోట్లు వసూలు చేసింది. ఇప్పుడీ సినిమా దర్శకుడు సందీప్ వంగాకి పవర్ ఫుల్ ఆఫర్ వచ్చిపడినట్టు చెబుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలకి ‘అర్జున్ రెడ్డి’ సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. మహేష్ బాబు, రామ్ చరణ్.. అర్జున్ రెడ్డి దర్శకుడిపై ప్రశంసలు కురిపించారు. అయితే, ఈ లిస్టులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నట్టు సమాచారమ్.

అర్జున్ రెడ్డి సినిమాని చూసిన పవన్ దర్శకుడు సందీప్ వంగాని అభినందించారట. ఓ మంచి కథ ఉంటే చెప్పమని కోరాడట. ఆ కొద్దిరోజులకే సందీప్ పవన్ కి ఓ లైన్ వినిపించాడని.. ఆ లైన్ ని డెవలెప్ చేయమని పవన్ చెప్పాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు సందీప్ వంగాతో ఓ సినిమా ఒప్పందం కోసం ఇప్పటికే రూ. 50లక్షల అడ్వాన్సు ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో మైత్రీ మూవీస్ సంస్థలో సందీప్ వంగా దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా ఉండబోతుందన్నది లెటెస్ట్ టాక్. మరీ.. ఇప్పటికే పవన్ తో కథని ఓకే చేయించుకొన్న సంతోష్ శ్రీనివాస్ పరిస్థితి ఏమిటీ? అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.