అడ్డంగా మోసపోయిన సంజన

sanjana

సాధారణంగా చిట్ ఫండ్ లాంటి స్కామ్ లు మధ్య తరగతి కుటుంబాలని ముంచేస్తుంటాయి. స్కీములు స్కాములకు బలైపోయేది మధ్యతరగతి ప్రజానీకమే. అయితే ఇప్పుడు ఓ సినీ సెలబ్రిటీ కూడా చిట్ ఫండ్ స్కామ్ లో బలైపోవడం షాకింగ్ గా వుంది. ఆమె ఎవరి కాదు .. బుజ్జిగాడు ఫేం సంజన.

తాజాగా కర్ణాటకలో ఓ చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. బెంగుళూరులోని ప్రసిద్ధి చిట్ ఫండ్స్ 300 మంది కుటుంబాలను మోసం చేసి రూ. 17 కోట్ల వరకు మింగేసింది. ఇందులో మోసపోయిన బాధితుల్లో సంజన కూడా ఉంది. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. బాధితుల్లో తన పేరు ఉందని బయటకు వచ్చినా తానేం పట్టించుకోనని.. ఈ విషయంలో సోషల్ మీడియా ద్వారా మరింత మందికి చేరాలని కోరుకుంది. చిట్స్ కంపెనీ నడిపిన వాళ్లు బెంగుళూరులో లగ్జరీ లైఫ్ గడిపారని.. సొంత మెర్సిడిస్ బెంజి కారులో తిరిగారని.. బోలెడు ఆస్తులు పోగేసుకున్నారని, గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని , బాదితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేసింది సంజన.