బాబోయ్.. ఎంట్రీకి ముందే డిమాండ్ చూపిస్తోంది !

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ హీరోయిన్’గా ఎంట్రీ ఇవ్వక ముందే డిమాండ్ చూపిస్తోంది. కుర్ర హీరోలతో జతకట్టే ప్రసక్తే లేదు. కేవలం స్టార్ హీరోలతో మాత్రం నటిస్తా. కథల విషయంలోనూ భారీ సినిమాలు చేస్తానని క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో ఇప్పటికే 7 కథలని రిజెక్ట్ చేసిందట. కథలో భారీతనం లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.

ఇప్పటికే సారా స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకొంది. హాట్ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులని అలరిస్తోంది. ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే విషయంలోనూ స్టార్ హీరోయిన్ రేంజ్ లో కండీషన్స్ పెడుతుందట. ఇలా ఐతే, సారా ఎంట్రీ అవుతుంది ? ఆమె ఎప్పుడు తెరపై చూసి ఆనందిస్తామని ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు.