ముద్దుపై మండిపడిన షాహిద్

తెలుగు బ్లాక్‌ బస్టర్‌ ‘అర్జున్‌ రెడ్డి’ బాలీవుడ్ లో ‘కబీర్‌ సింగ్‌’ రీమేక్‌గా రాబోతున్న సంగతి తెలిసిందే. మాతృకను తెరకెక్కించిన సందీప్‌ రెడ్డి వంగానే రీమేక్‌కు దర్శకత్వం వహించారు. జూన్‌ 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం మీడియా సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఓ విలేకరి ముద్దు సీన్లపై హీరోయిన్ కైరా అద్వానీని గుచ్చి గుచ్చి అడిగాడు.

‘మేడమ్‌.. మీరు సినిమాలో ముద్దు సన్నివేశాల్లో నటించినప్పుడు ఏమీ అనిపించలేదా?’ అన్నాడు. ఆ ప్రశ్నకు కాస్త అసౌకర్యంగా ఫీలైన కియారా సమాధానం చెప్పకుండా నవ్వి ఊరుకున్నారు. అయినా ఆ విలేకరి వదల్లేదు. అందరి ముందు మాటిమాటికీ అదే ప్రశ్న అడిగి విసిగించాడు. దాంతో పక్కనే ఉన్న షాహిద్‌ మైక్‌ అందుకుని.. ‘మీ జీవితంలో గర్ల్‌ఫ్రెండ్‌ లేదా ఏంటీ? ముద్దు సన్నివేశాల గురించి వదిలేయండి. మరేదైనా అడగండి. సినిమాలో నటించిన వారూ ఇక్కడే ఉన్నారు కదా..’ అని మండిపడ్డారు.