శంకర్ డైరెక్షన్లో మెగాస్టార్ మూవీ..ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా..?

సంచలన డైరెక్టర్ శంకర్…మెగాస్టార్ చిరంజీవి ని డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి సురేందర్ రెడ్డి డైరెక్షన్లో సైరా నరసింహ రెడ్డి సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కేరళ అడవుల్లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ తరువాత హైదరాబాద్ లో మరో షెడ్యూల్ పూర్తి చేసి, గుమ్మడికాయ కొట్టబోతున్నారు. ఇక దీని తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో సోషల్ మెసేజ్ సినిమా చేయనున్నాడు చిరు. ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ జూన్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇక దీని తర్వాత శంకర్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను నిర్మిస్తుందట. దీనికి సంబంధించిన ప్రాధమిక చర్చలు కూడా జరిగినట్టు సమాచారం. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కి ఈ సినిమాలో తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తే… తమిళంలో అజిత్ లేదా విజయ్ నటిస్తారని తెలుస్తోంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.